బిజినెస్

ఫెడ్ రిజర్వ్ తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 9: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నాలుగు వారాల్లో గరిష్ఠ లాభాలను పొందింది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్.. వచ్చే నెల సమీక్షలో వడ్డీరేట్లను పెంచబోదన్న సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. ఇది భారతీయ సూచీలనూ ప్రభావితం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో షేర్ విలువ అత్యధికంగా 3.78 శాతం పుంజుకోగా, యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 3.41 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 460.36 పాయింట్లు ఎగబాకి 25,688.86 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 132.60 పాయింట్లు లాభపడి 7,866.05 వద్ద స్థిరపడింది. నిజానికి ఉదయం ప్రారంభం నుంచే సూచీలు భారీ లాభాల్లో కదలాడుతూ వచ్చాయి. ఆరంభంలో సెనె్సక్స్ 326, నిఫ్టీ 96 పాయింట్లు లేచాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, టెలికామ్, రియల్టీ, ఆటో, టెక్నాలజీ, విద్యుత్ రంగాల షేర్ల విలువకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ జోరు చివరిదాకా కొనసాగింది. అక్షయ తృతీయ నేపథ్యంలో జ్యుయెల్లరీ సంస్థల షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. పిసి జ్యుయెల్లర్స్, టైటాన్ షేర్ల విలువ 1.03 శాతం నుంచి 0.41 శాతం మేర పెరిగాయి. మరోవైపు హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) షేర్ విలువ 0.80 శాతం నష్టపోగా, జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ లాభం 7 శాతం పెరిగినట్లు సోమవారం హెచ్‌యుఎల్ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్ షేర్ల విలువ కూడా 0.91 శాతం, 0.12 శాతం మేర దిగజారింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 1.25 శాతం, స్మాల్-క్యాప్ 1.20 శాతం లాభపడ్డాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా 2.79 శాతం నష్టపోగా, తైవాన్, దక్షిణ కొరియా సూచీలు కూడా 0.45 శాతం మేర పడిపోయాయి. అయితే హాంకాంగ్, జపాన్, సింగపూర్ సూచీలు 0.23 శాతం నుంచి 1.29 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు సైతం 1.85 శాతం మేర పుంజుకున్నాయి.