బిజినెస్

జీఎస్టీతో వస్త్ర వ్యాపారులకు ఇబ్బంది ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో వస్త్ర వ్యాపారులకు ఎలాంటి భారం, ఇబ్బందులు ఉండబోవని సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.రామనాథరెడ్డి అన్నారు. జీఎస్టీ అత్యంత ఉన్నతమైన పన్ను విధానమని ఆయన అన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో గురువారం చాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన జీఎస్టీపై వర్క్‌షాపులో రామనాథరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. వ్యాపారస్తుల సందేహాలు నివృత్తి చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, వస్త్ర వ్యాపారస్తులు కూడా పరస్పరం తమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌలభ్యం ఉండడంతో వస్త్ర వ్యాపారులు జీఎస్టీ విషయమై ఎలాంటి భయాలకు లోనుకానవసరం లేదన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఐ.అశోక్‌కుమార్ వస్త్ర వ్యాపారులు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. టర్నోవర్ 1.5 కోట్ల లోపు ఉంటే హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ అవసరం ఉండదన్నారు. వస్తువులు తిరిగి వచ్చినప్పుడు క్రెడిట్ నోట్ ఇవ్వాలన్నారు. వేర్వేరు బిల్లుల మొత్తం రూ.50వేలు మించి ఒకే వాహనంలో వెళితే ఇ-వేబిల్ ఇవ్వాల్సి ఉందన్నారు. వ్యాపారులు కొనుగోలుదారునకు డిస్కౌంట్, తగ్గింపు వంటివి ఇస్తే వాటిని మినహాయించి నెట్ విలువపై జీఎస్టీ కట్టవచ్చన్నారు. వస్తువులు చేరిన రోజే రికార్డుల్లో నమోదు చేయాల్సిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ చాంబర్ కార్యాలయంలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, వ్యాపారస్తులు తమతమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.