బిజినెస్

సగం తగ్గిన ఆర్‌బిఐ డివిడెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బిఐ చెల్లించాల్సిన డివిడెండ్ సగానికి సగం తగ్గిపోయింది. గత ఏడాది 65,876కోట్ల మిగులు నిధులను డివిడెండ్‌గా ప్రభుత్వానికి అందించిన ఆర్‌బిఐ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను కేవలం 30,659 కోట్ల రూపాయల డివిడెండ్‌ను మాత్రమే అందించింది.
ఈ డివిడెండ్ తగ్గిపోవడానికి కారణం పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్ల ముద్రణకు అయిన వ్యయమేనని నిపుణులు విశే్లషిస్తున్నారు. గురువారం నాడిక్కడ సమావేశమైన ఆర్‌బిఐ సెంట్రల్ బోర్డు 30,659 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడానికి ఆమోదించింది. ఆర్‌బిఐ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ప్రభుత్వానికి తక్కువ డివిడెండ్ చెల్లించడానికి కారణం ఏమిటన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్‌బిఐ నుంచి 58వేల కోట్ల డివిడెండ్ వస్తుందని ఆశించింది. ఆర్‌బిఐతోపాటు ఇతర జాతీయ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి 74,901.25 కోట్ల రూపాయల డివిడెండ్ వస్తుందని బడ్జెట్‌లోనూ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆర్‌బిఐ నుంచి తక్కువ డివిడెండ్ రావడంవల్ల విత్తపరమైన లెక్కలపై ఒత్తిడి పడే ప్రభావం కనిపిస్తోంది. 2017-18 సంవత్సర ఆర్థిక లోటు 3.2 శాతాన్ని పూడ్చుకోడానికి ప్రభుత్వం ఇతరత్రా వనరులను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.