బిజినెస్

ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: పెద్దనోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నల్లధన అవినీతి నిరోధక చర్యల వల్ల పన్నులు-స్థూల జాతీయ ఉత్పత్తి నిష్పత్తి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా జిఎస్‌టి అమల్లోకి రావడంతోపాటు దేశ వ్యాప్తంగా నిఘా కూడా పెరగడంతో ఈ నిష్పత్తి 2019-20 నాటికి 11.9 శాతానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్థూలపన్ను-జిడిపి నిష్పత్తి 11.3శాతం మేర ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బడ్జెట్‌లో ఆశించిన విధంగానే మధ్యశ్రేణి పన్నుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే జిఎస్‌టిని చేరుస్తామని,అయితే పన్ను-జిడిపి నిష్పత్తి మాత్రం 2016-17 స్థాయిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో పన్నుల ద్వారా 19.06 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అది గత ఏడాది కంటే 15 శాతం ఎక్కువని ప్రభుత్వం అంచనా వేసింది. అనుకున్న ప్రకారమే ఈ ఆదాయం పెరుగుతోందని, జిఎస్‌టి అమలుతో పాటు పెరిగిన ఆర్థిక నిఘా కూడా ఇందుకు దారితీస్తోందని వివరించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్‌టి వల్ల ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతోందని, స్థూల జాతీయ ఆదాయం కూడా రెండు శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అదనంగా కోటి మంది పన్నుల పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే.