బిజినెస్

పవన్ హన్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: హెలికాప్టర్ సర్వీసును నిర్వహిస్తున్న పవన్ హన్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం న్యాయసలహాదారుల నియామకాన్ని ఖరారు చేసింది. వీరితోపాటు మొత్తం విలువను అంచనా వేసే నిపుణులను కూడా నియమించినట్టు గురువారం లోక్‌సభలో వెల్లడించింది. పవన్ హన్స్ నుంచి వ్యూహాత్మక రీతిలో పెట్టుబడుల ఉప సంహకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గత ఏడాది అక్టోబర్‌లోనే సూత్రప్రాయంగా అంగీకరించింది. పవన్ హన్స్ సంస్థ ఇటు ప్రభుత్వం, ఓన్‌జిసి సంయుక్త సారధ్యంలో నడుస్తోంది. ఇందులో ఓఎన్‌జిసి వాటా 49 శాతం. 450 మంది పర్మినెంట్ ఉద్యోగులతోపాటు ఇందులో 900 మంది పనిచేస్తున్నారు. 1985లో ఏర్పాటైన సంస్థ 40కి పైగా హెలీకాప్టర్లను నడుపుతోంది.