బిజినెస్

ఒప్పందానికి టాటా,స్కోడాలు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: తమ మధ్య కుదిరిన భాగస్వామ్య ప్రణాళిక నుంచి తప్పుకుంటున్న టాటా మోటార్స్, వోక్స్ వ్యాగన్ గ్రూపు సంస్థ స్కోడాలు గురువారం ప్రకటించాయి. ఈ రెండు సంస్థల మధ్యా నాలుగు నెలల క్రితమే ఈ ఒప్పందం కుదిరినప్పటికీ సాధ్యాసాధ్యాల అంచనా కారణంగా దీన్ని రద్దుచేసుకుంటున్నట్టు రెండు సంస్థలు తెలిపాయి. ఈ సంయుక్త భాగస్వామ్యం వల్ల రెండు సంస్థలకు కూడా అనుకున్న స్థాయికంటే లాభాలు తక్కువగానే ఉంటాయని, సంయుక్త సాంకేతిక అధ్యయనంలో వెల్లడైంది. అయితే గత కొన్ని నెలలుగా తమ మధ్య జరుగుతున్న విస్తృత, నిర్మాణాత్మక చర్చల నేపథ్యంలో భవిష్యత్‌లో కలిసిపనిచేసే అవకాశం లేకపోలేదని తెలిపాయి. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ భవిష్యత్‌లో కలిసిపనిచేసే అవకాశం ఏమున్నా సానుకూలంగా పరిశీలిస్తామని టాటా మోటర్స్ సిఇవో గ్యున్‌టర్ బట్సెక్ ఓ ప్రకటనలో తెలిపారు. స్కోడా సంస్థ కూడా ఈ మేరకు మరో ప్రకటన జారీ చేసింది. అనుకున్న స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం లేదుకాబట్టి ఈ ఒప్పందాన్ని వదులుకుంటున్నట్టు స్పష్టం చేసింది.