బిజినెస్

త్వరలో తెలుగు రాష్ట్రాలకు ఉల్లి పౌడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 11: తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఎదురయ్యే ఉల్లిపాయల కొరత సమస్యను తీర్చడానికి త్వరలోనే ఉల్లిపౌడర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని జాతీయ ఉద్యానవన బోర్డు డైరెక్టర్ సిహెచ్ సత్యకృష్ణంరాజు తెలిపారు. త్వరగా పాడయ్యే లక్షణం కారణంగా నిత్యం ఉల్లి సరఫరా, డిమాండ్ల మధ్య వ్యత్యాసం ఏర్పడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఉల్లి పౌడర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.
ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ పౌడర్‌ను దేశీయ అవసరాల రీత్యా తయారు చేయిస్తామన్న ఆయన ఉల్లి దిగుబడి ఎక్కువగా ఉండే మహారాష్టల్రో పౌడర్ తయారీ చేపడతామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరువుల్లో రొయ్యలు, చేపల పెంపకాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం భీమవరంలో విలేఖరులతో మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో ఎక్కువగా పండే బంగాళదుంపలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పండే టమోటా, మామిడిని కూడా పౌడర్ రూపంలోకి మార్చి, విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గల్ఫ్ దేశాల నుంచి లిచీ అనే పండును దిగుమతి చేసుకుంటున్నామని, వీటి ఉత్పత్తికి ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలు అనుకూల వాతావరణం కలిగి ఉన్నట్టు గుర్తించామన్నారు. కాగా, 2022 నాటికి దేశంలోని ఉద్యానవన రైతుల ఆదాయం రెండింతలు చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఉద్యానవనంలో పువ్వు నుంచి పండు వరకు ఉత్పత్తిచేసే రైతులకు ప్రభుత్వం 35 శాతం సబ్సిడీ ఇస్తోందన్నారు. 330 కోట్ల రూపాయలు ఉండే ఉద్యానవన బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం 850 కోట్ల రూపాయలకు పెంచిందని గుర్తుచేశారు. పశు సంపద అభివృద్ది, పాల ఉత్పత్తి, చేపలు, రొయ్యలు, తదితర మాంసపు ఉత్పత్తుల ఎగుమతులు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సత్యకృష్ణంరాజు ఈ సందర్భంగా చెప్పారు.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేరుశెనగ రైతులు బాగా ఉపయోగించుకున్నారని వివరించారు. ఆయన వెంట ఆక్వా రైతు చెరుకూరి వెంకట కృష్ణంరాజు, బూసి సురేంద్రనాధ్ బెనర్జీ ఉన్నారు.