బిజినెస్

ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

40 శాతం క్షీణించిన
హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 39.35 శాతం క్షీణించి 10.37 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 17.10 కోట్ల రూపాయలగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 618.27 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 468.39 కోట్ల రూపాయలుగా ఉంది.
సిప్లా నికర లాభం
రూ. 425 కోట్లు
ఔషధ రంగ సంస్థ సిప్లా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో చూస్తే 23.63 శాతం పెరిగి 424.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 343.70 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,525.05 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 3,650.03 కోట్ల రూపాయలుగా ఉంది.
పడిపోయన బాష్ లాభం
ఆటో విడిభాగాల తయారీ దిగ్గజం బాష్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20.09 శాతం పడిపోయ 302.61 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 378.72 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఇక ఆదాయం ఈసారి 2,959.97 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,903.82 కోట్ల రూపాయలుగా ఉంది.
స్వల్పంగా తగ్గిన
హిందాల్కో నికర లాభం
అల్యూమినియం తయారీదారు హిందాల్కో స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గి 289.60 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 294.27 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 10,663.37 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 8,385.55 కోట్ల రూపాయలుగా ఉంది.
నష్టాల్లోకి సన్ ఫార్మా
ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా ఏకీకృత నికర నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 424.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 2,033.71 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఇక ఆదాయం ఈసారి 6,208.79 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 8,256.26 కోట్ల రూపాయలుగా ఉంది.
ఓరియంటల్ బ్యాంక్
నికర నష్టం రూ. 486 కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 486.20 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 100.69 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 5,204.45 కోట్ల రూపాయలుగా, పోయనసారి 5,397.92 కోట్ల రూపాయలుగా ఉంది.
జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ
లాభం రూ. 217 కోట్లు
జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 40 శాతం పతనమై 217.18 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 364.89 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఇక ఆదాయం ఈసారి 2,232 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,450 కోట్ల రూపాయలుగా ఉంది.
52 శాతం దిగజారిన
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే దాదాపు 52 శాతం దిగజారి 203.39 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 423.62 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 12,103.86 కోట్ల రూపాయలుగా, పోయనసారి 11,877.91 కోట్ల రూపాయ లుగా ఉందని బ్యాంక్ తెలియజేసింది.