బిజినెస్

మూర్తి వస్తేనే ఇన్ఫోసిస్‌కు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఇన్ఫోసిస్‌లోకి చైర్మన్ ఎమిరెట్స్‌గా ఎన్ ఆర్ నారాయణ మూర్తి మళ్లీ రావాలని ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) టి వి మోహన్‌దాస్ పాయ్ అన్నారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌లో గత కొంతకాలం నుంచి ప్రమోటర్లకు, వ్యవస్థాపకులకు మధ్య అభిప్రాయ బేధాలు నెలకొన్నది తెలిసిందే. ప్రస్తుత యాజమాన్యం తీరుపట్ల మూర్తిసహా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే దీనిపై వారు స్పందిస్తున్నారు కూడా. ఉన్నత స్థాయి ఉద్యోగులకు, క్రింది స్థాయి ఉద్యోగులకు వేతనాల్లో వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో పాయ్ పైవిధంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫోసిస్‌లోకి మూర్తి మళ్లీ చైర్మన్ ఎమిరెట్స్‌గా వస్తే బాగుంటుందని, మసకబారిన ఇన్ఫోసిస్ వైభవం.. తిరిగి వెలుగొందుతుందంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రపంచంలోనే మూర్తి ఓ గొప్ప బిజినెస్ ఐకాన్ అన్న ఆయన జెఆర్‌డి టాటా, ధీరూభాయ్ అంబానీ, మూర్తి లాంటివారు భారత్‌లో లేనే లేరని, ఉండరని అన్నారు.