బిజినెస్

మాల్యా పిటిషన్‌ను కొట్టివేసిన శాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని విజయ్ మాల్యా.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదేశానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం కొట్టివేసింది. దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాలుగా పొంది, వాటిని తిరిగి చెల్లించలేక మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే. ఈ క్రమంలోనే మార్కెట్, ఆయా సంస్థల బోర్డుల్లో సభ్యత్వాల నుంచి మాల్యాను సెబీ నిషేధించింది. దీనిపైనే పిటిషన్ వేయగా, దాన్ని శాట్ తిరస్కరించింది. మూడు వారాల్లోగా సెబీ ఎదుట హాజరు కావాలని కూడా తెలిపింది.