బిజినెస్

క్వికర్ హస్తగతమైన సలోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 10: ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్.. బ్యూటీ సర్వీసెస్ ప్రొవైడర్ సలోసాను హస్తగతం చేసుకుంది. ఈ మేరకు మంగళవారం క్వికర్ తెలియజేసింది. హోమ్ సర్వీసెస్ విభాగంలో 250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలన్న ప్రణాళికలో భాగంగానే సలోసా వ్యూహాత్మక కొనుగోలు అని క్వికర్ తెలిపింది. తాజా పెట్టుబడులు క్వికర్ సేవలను మరింత విస్తృతపరచగలవన్న విశ్వాసాన్ని ఓ ప్రకటనలో ఆ సంస్థ వ్యక్తం చేసింది. కాగా, నిరుడు సెప్టెంబర్‌లో సలోసాను పిఅండ్‌జి మాజీ ప్రొఫెషనల్స్ పియూష్ ధనూకా, అనురాగ్ నాయర్‌లు స్థాపించారు. ఇదిలావుంటే క్వికర్ సర్వీసెస్ పిడి సుందర్ మాట్లాడుతూ ‘్భరత్‌లో బ్యూటీ సేవల మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లకు సమీపించింది. ఈ క్రమంలో సలోసా కొనుగోలుతో టైర్-1, టైర్-2 శ్రేణి పట్టణాల నుంచి కూడా వ్యాపారాన్ని అందుకోగలుగుతాం.’ అని అన్నారు. క్వికర్ సర్వీస్‌లో 2,50,000 మంది పనిచేస్తున్నారు. 80కిపైగా రకాల సేవలను రోజూ లక్ష మంది వినియోగదారులకు అందిస్తోంది.