బిజినెస్

మాల్యాతో సంబంధాల్లేవ్: యుబిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్).. విజయ్ మాల్యాతో సంస్థాగత సమాచారాన్ని పంచుకోవడం లేదు. యుబిఎల్ ఒకప్పటి చైర్మన్ మాల్యా అన్నది తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్లలో ఉన్న సంస్థల్లో డైరెక్టర్‌గా లేదా ఏదైనా కీలక బాధ్యతల్లో మాల్యా ఉండరాదంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం విధించిన తర్వాత మాల్యాతో యుబిఎల్ సంబంధాలు తెగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే సమాచార సంబంధాలు నిలిచిపోయినట్లు యుబిఎల్ తెలిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో మాల్యా నిరుడు మార్చి 2న లండన్‌కు పారిపోయినది తెలిసిందే.