బిజినెస్

ద్రవ్యోల్బణం గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం కోల్ ఇండియా, ఐడిబిఐ, టాటా పవర్ తదితర సంస్థలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయ. దీంతో మదుపరుల పెట్టుబడులను ఇవి ప్రభావితం చేస్తాయన్న అంచనాను ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా వెలిబుచ్చారు. దీంతో ఆయా సంస్థలకు లాభాలు భారీగా వస్తే స్టాక్ మార్కెట్లు కూడా పెద్దగా లాభప డవచ్చన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయ. అయతే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. డొల్ల కంపెనీలపై విధించిన నిషేధం వ్యవహారం ట్రేడింగ్ సరళిని అన్నిటికంటే అధికంగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్లలో చేరిన 331 అనుమానిత డొల్ల కంపెనీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించడంతో మదుపరుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోయనది తెలిసిందే. ఈ సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేసింది సెబీ. వీటిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంస్థలే ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీకి చెందిన సంస్థలూ అధికంగానే ఉన్నాయి. ఒడిషా, అస్సాం, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థలూ ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ, ఎస్‌ఎఫ్‌ఐఒ దర్యాప్తుల్లో తేలిన నిజాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. సెబీకి తెలియజేసింది. దీంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 127 సంస్థలు, మహారాష్టక్రు చెందిన 50 సంస్థలు, గుజరాత్, ఢిల్లీకి చెందిన 30కిపైగా సంస్థలతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మొత్తం 331 సంస్థల షేర్ లావాదేవీలపై సెబీ వేటు వేసింది. వరుస లాభాలతో పరుగులు పెడుతూ రికార్డులను సృష్టిస్తున్న స్టాక్ మార్కెట్లు ఈ కారణంగానే గత వారం నష్టాల పాలయ్యాయ. 5 వారాల లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,111.82 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 355.60 పాయంట్లు కోల్పోయాయ. అయతే సెబీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని కంపెనీలు శాట్‌కు వెళ్లడంతో వాటికి ఊరట లభించినది తెలిసిందే. దీంతో ఈ వారం కూడా ఈ వ్యవహారం మదుపరుల పెట్టుబడులపై సహజంగానే ప్రభావం చూపుతుందని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వర్ష సమాచారమూ ముఖ్యమేనని అంటున్నారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా పడుతున్నది తెలిసిందే. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలుండటంతో ప్రధాన నదులన్నింటికీ వరదలు వస్తున్నాయ. ఫలితంగా దేశీయ వ్యవసాయం ముఖ్యంగా వర్షాధారం కావడంతో ఈసారి పంటలు బాగా పండుతాయన్న అంచనాలున్నాయ.
ఇక వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సిపిఐ), టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) గణాంకాలు ఈ వారమే విడుదల కానున్నాయ. వీటి ప్రభావం కూడా మార్కెట్ ట్రేడింగ్‌పై ఉండనుంది. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. బుధవారం తిరిగి యథాతథంగా ట్రేడింగ్ జరుగుతుంది.