బిజినెస్

ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

51 శాతం క్షీణించిన
అపోలో హాస్పిటల్స్ లాభం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ స్టాండలోన్ నికర లాభం గతంతో పోల్చితే 51.21 శాతం పడిపోయ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 35.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 72.17 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,684.46 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,465.43 కోట్ల రూపాయలుగా ఉందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది.
ఐడిబిఐ నష్టం రూ. 853 కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 853 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 241.10 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 6,730.88 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 8,219.43 కోట్ల రూపాయలుగా ఉంది.
టాటా పవర్
లాభం రూ. 163 కోట్లు
ప్రైవేట్ రంగ విద్యుదుత్పాదక సంస్థ టాటా పవర్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 126 శాతం పెరిగి 163.78 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 72.49 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఇక ఆదాయం ఈసారి 6,999.90 కోట్ల రూపాయలుగా, పోయినసారి 6,790.58 కోట్ల రూపాయలుగా ఉంది.
జెకె టైర్ నష్టం రూ. 117 కోట్లు
జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 117.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి సంస్థ లాభం 100.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,942.86 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,957.76 కోట్ల రూపాయలుగా ఉంది.