బిజినెస్

8 నెలల కనిష్టానికి ఎగుమతుల వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశీయ ఎగుమతుల వృద్ధిరేటు 8 నెలల కనిష్టానికి పతనమైంది. గత నెల జూలైలో భారతీయ ఎగుమతుల్లో వృద్ధిరేటు 3.94 శాతానికే పరిమితమైంది. నిరుడు నవంబర్ నుంచి చూస్తే ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి. ఎగుమతులు 22.54 బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాణిజ్య లోటు 11.44 బిలియన్ డాలర్లకు చేరింది. దిగుమతులు ఈసారి 34 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, నిరుడు జూలైలో ఎగుమతులు 21.68 బిలియన్ డాలర్లుగా ఉంటే, దిగుమతులు 27.59 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే ఈసారి బంగారం దిగుమతులు గతంతో పోల్చితే ఏకంగా 95 శాతం ఎగిశాయి. 2.10 బిలియన్ డాలర్లను తాకాయి. నిరుడు జూలైలో 1.07 బిలియన్ డాలర్ల వద్దే ఉండటం గమనార్హం. మరోవైపు చమురు దిగుమతుల విలువ 7.84 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. గతంతో పోల్చితే ఇది 15 శాతం అధికం. దేశీయ దిగుమతుల్లో చమురు వాటానే అధికం. ఆ తర్వాత స్థానం బంగారం దిగుమతులదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో భారతీయ ఎగుమతులు 310 బిలియన్ డాలర్లు దాటాలన్నది లక్ష్యం. అయితే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో ఎగుమతులు తగ్గే వీలుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.