బిజినెస్

ఎగిసిన ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇటు హోల్‌సేల్, అటు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు రెండూ గత నెల జూలైలో పెరిగాయి. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) విడుదల చేసిన వివరాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 1.88 శాతానికి పెరిగింది. గడచిన ఐదు నెలల్లో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి. అంతకుముందు నెల జూన్‌లో 0.90 శాతంగా ఉంటే, నిరుడు జూలైలో 0.63 శాతంగా ఉంది. ఇక వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2.36 శాతాన్ని తాకింది. అంతకుముందు నెల జూన్‌లో ఇది మైనస్ 2.12 శాతంగా ఉంటే, నిరుడు జూలైలో 0.29 శాతంగా నమోదైంది. కొన్ని ఆహార పదార్థాల ధరలు పెరగడంతో హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణాలు ఎగబాకాయి. కాగా, చారిత్రక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) జూలై 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జూలై ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిఎస్‌టి అమలైతే ధరలు దిగివస్తాయన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపించిన క్రమంలో అటు టోకు, ఇటు చిల్లర ద్రవ్యోల్బణం సూచీలు ఎగిసిపడటం గమనార్హం. మరోవైపు తాజా గణాంకాల మధ్య కూడా కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించాలన్న డిమాండ్లు వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అసోచామ్, ఫిక్కీ వంటి పారిశ్రామిక సంఘాలు ఇదే కోరుతున్నాయి. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం పెరిగిందనే సాకుతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో రెపో రేటును పెంచకుండా, అలాగని యథాతథంగా ఉంచకుండా వ్యాపారావకాశాలు మరింత వృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకోవాలని మార్కెట్ వర్గాలు సైతం సూచిస్తున్నాయి. ఈ నెల ఆరంభంలో నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించినది తెలిసిందే.