బిజినెస్

ఎమ్‌టిఎన్‌ఎల్ నష్టం రూ. 703 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ ఎమ్‌టిఎన్‌ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 703.17 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో నష్టం 718.02 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే ఆదాయం ఈసారి ఏప్రిల్-జూన్‌లో 812.66 కోట్ల రూపాయలుగా, పోయినసారి ఏప్రిల్-జూన్‌లో 881.93 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఎమ్‌టిఎన్‌ఎల్ తెలియజేసింది. సంస్థాగత వ్యయం ఈసారి 1,515.83 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 1,599.94 కోట్ల రూపాయలుగా ఉంది. ఢిల్లీ, ముంబయల్లో ఎమ్‌టిఎన్‌ఎల్ టెలికామ్ సేవలను అందిస్తోంది. పోయనసారితో చూస్తే ఈ ఏప్రిల్-జూన్‌లో సంస్థ రుణభారం 3.6 శాతం పెరిగి 358.36 కోట్ల రూపాయలకు చేరుకుంది.