బిజినెస్

తగ్గిన కోల్ ఇండియా నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వ రంగ సంస్థ, దేశీయ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 23 శాతం క్షీణించింది. ఈసారి 2,351.2 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 3,065.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కోల్ ఇండియా తెలియజేసింది. అయితే ఆదాయం ఈసారి 21,774.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయినసారితో పోల్చితే 4.5 శాతం అధికం. కాగా, స్టాండలోన్ ఆధారంగా సంస్థ లాభం 32.18 కోట్ల రూపాయలుగా, ఆదాయం 187.8 కోట్ల రూపాయలుగా ఉంది. ఉత్పత్తి ఈ ఏప్రిల్-జూన్‌లో 118.8 మిలియన్ టన్నులుగా, నిరుడు 125.6 మిలియన్ టన్నులుగా ఉందని కోల్ ఇండియా తెలియజేసింది.