బిజినెస్

ఆంబీ వ్యాలీ వేలం ప్రక్రియ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 14: సహారా గ్రూప్‌నకు చెందిన విలాసవంతమైన ఆంబీ వ్యాలీ రిసార్ట్ టౌన్ వేలం ప్రక్రియ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశంతో ఇది ఆరంభమవగా, ప్రారంభ ధర 37,392 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. పుణె జిల్లా లోనవాల సమీపంలో 6,761.6 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఈ హిల్ సిటీ టౌన్‌షిప్ విస్తరించి ఉంది. కాగా, ఈ లగ్జరీ రిసార్ట్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని సహారా గ్రూప్ చెబుతోంది. సెబీ-సహారా కేసులో భాగంగా చేయాల్సిన నగదు డిపాజిట్ల కోసం అత్యున్నత న్యాయస్థానం సహారా ఆస్తుల విక్రయానికి సిద్ధమైనది తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా రెండు సహారా గ్రూప్ సంస్థలు మార్కెట్ నుంచి 20,000 కోట్ల రూపాయలకుపైగా నిధులను సమీకరించడంపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సొమ్ము డిపాజిటర్లకు తిరిగి చెల్లించాలని సహారాను ఆదేశించగా, చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.