బిజినెస్

దీన్ దయాళ్ గ్రామీణ విద్యుద్దీకరణ యోజనకు రూ. 336 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: దీన్ దయాళ్ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన కింద 336 కోట్ల రూపాయల వ్యయంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి 125 రూపాయలకే సర్వీసు వైర్, ఎల్‌ఇడి బల్బులతో విద్యుత్ సర్వీసు మంజూరు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలంగాణ సదరన్ పవర్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడ దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మాట్లాడుతూ వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. కాగా, ఈ పథకం కింద 2,85,240 కుటుంబాలకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. సదరన్ డిస్కాం పరిధిలో విద్యుత్ కోతలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, పరిశ్రమలకు, గృహ విద్యుత్ వినియోగదారులకు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్, జె శ్రీనివాస్ ఎడ్డి, మీర్ కమాలుద్దీన్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. జెండా వందనం చేస్తున్న రఘుమారెడ్డి తదితరులు