బిజినెస్

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: త్వరలోనే రామగుండంలో తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు మొదటి దశ పనులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసి) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విబి ఫడ్నవీస్ తెలిపారు.
మంగళవారం ఇక్కడ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఉంటాయన్నారు. ఒక్కో యూనిట్ కెపాసిటీ 800 మెగావాట్లని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో 250 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఈ నెల 14వ తేదీన 210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. అలాగే రామగుండంలోని 10 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ 15.871667 ఎంయు విద్యుత్‌ను 2015-16లో 17.82 శాతం పిఎల్‌ఎఫ్‌తో సాధించినట్లు చెప్పారు.
కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలతో సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పే విషయమై ఒప్పందాలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. నేషనల్ సోలార్ మిషన్ కింద ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక దేశం మొత్తం మీద గ్రీన్ పవర్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిపిసి జనరల్ మేనేజర్ పికె జైన్, ఎజిఎం హెచ్‌ఆర్ డాక్టర్ టి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో ప్రతిభను కనబరచిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్స్‌ను ప్రదానం చేశారు.