బిజినెస్

నిర్మాణ రంగంలో జోరుగా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ నిర్మాణ రంగంలోకి ఈ ఏడాది ప్రథమార్ధంలో 16,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు వచ్చాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్‌ఎల్ ఇండియా వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య అటు రుణ, ఇటు ఈక్విటీ మార్కెట్లలోకి మొత్తం 16,008 కోట్ల రూపాయల పెట్టుబడులను రియల్ ఎస్టేట్ రంగం ఆకర్షించింది. ఇందులో 56 శాతం పెట్టుబడులు హౌసింగ్, టౌన్‌షిప్ ప్రాజెక్టుల్లోకే వచ్చాయి.
వీటి విలువ 9,000 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని జెఎల్‌ఎల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్) శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఐటి, వాణిజ్య ప్రాజెక్టులు 22 శాతం పెట్టుబడులను అందుకున్నాయని, వీటి విలువ 3,500 కోట్ల రూపాయలుగా ఉంటుందని చెప్పారు. అలాగే గిడ్డంగుల నిర్మాణంలోకి 20 శాతం పెట్టుబడులు రాగా, అతి తక్కువగా రిటైల్ రంగంలోకి 4 శాతం పెట్టుబడులు వచ్చాయని అన్నారు. నాణ్యత లోపించడమే కారణమని పేర్కొన్నారు. ఇక నిరుడు ప్రథమార్ధంతో పోల్చితే ఈ యేడు ప్రథమార్ధంలో ఆఫీస్ అసెట్ క్లాస్ తక్కువ పెట్టుబడులను అందుకుందని వివరించారు.
ఈక్విటీ డీల్స్ తగ్గిపోవడమే కారణమని చెప్పారు. అయితే ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో పెరిగే వీలుందన్న ఆశాభావాన్ని అగర్వాల్ ఓ బ్లాగ్‌లో వెలిబుచ్చారు. కాగా, ఆఫీస్ విభాగం కంటే హౌసింగ్ విభాగం.. పెట్టుబడులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త నిర్మాణ రంగ చట్టం (రెరా) అమలు తర్వాత నిర్మాణ రంగంలోకి పెట్టుబడులు పెరిగాయని, ముఖ్యంగా హౌసింగ్ విభాగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దీనికి కారణం మదుపరుల్లో పెరిగిన విశ్వాసమేనని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలను అరికట్టేలా రెరా రావడంతో, కొనుగోలుదారుల్లో తమ కష్టార్జితం ఎక్కడికీపోదన్న నమ్మకం ఏర్పడింది. ఇన్నాళ్లూ బిల్డర్లు డబ్బులు తీసుకుని, నిర్మాణాలు చేపట్టకపోవడం, గడువు లోపల వాటిని అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు కష్టాలపాలయ్యారు.
అయితే రెరా చట్టం రాకతో ఇలాంటి బిల్డర్లకు భారీగా జరిమానాలు, జైలుశిక్షలు పడే అవకాశాలొచ్చాయి. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని అగర్వాల్ చెప్పుకొచ్చారు. కెనడా పెన్షన్ ప్లాన్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు (సిపిపిఐబి).. వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్‌స్టోన్‌కు చెందిన ఇండోస్పేస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు ముందుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇరు సంస్థల మధ్య 500 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగినట్లు తెలిపారు. వేర్‌హౌసింగ్ విభాగంలో ఇది అతిపెద్ద ఒప్పందమేనన్నారు.
చైనా, జపాన్, కొరియా తదితర దేశాల సంస్థలెన్నో భారతీయ నిర్మాణ రంగంలో పెట్టుబడులకు ఇప్పుడు ఆసక్తిని కనబరుస్తున్నాయన్న ఆయన చట్టాలు ప్రభావవంతంగా, పారదర్శకంగా ఉంటే పెట్టుబడులు అన్ని రంగాల్లోకి వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.