బిజినెస్

అవినీతి అంతు చూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో అయన డిపాజిట్లలో 1.75 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను పరిశీలిస్తున్నామని, ఆదాయానికి మించి లావాదేవీలు జరిపిన 18 లక్షల మంది అకౌంట్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అయతే వీరిలో 4 లక్షల 50 వేల మంది తమ తప్పును ఒప్పుకుని సరిదిద్దుకుంటున్నారన్నారు. కానీ దేశాన్ని దోచినవారు ఇక సుఖంగా నిద్రించలేరని ఉద్ఘాటించారు. నోట్ల రద్దు తర్వాత లెక్కలకు అందని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు చెప్పారు. మంగళవారం దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట బురుజుపై నుండి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. నల్లధనంపై ప్రారంభించిన యుద్ధం నిర్విరామంగా కొనసాగుతోందని, నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన అనంతరం బ్యాంకుల్లో నల్లధనాన్ని డిపాజిట్ చేసినవారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై అధికారులు వాకబు చేస్తున్నారని వివరించారు. దీనివలన కొత్తగా నల్లధనం జమకాకుండా చేయగలిగామన్నారు. పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకుని తమ బీరువాల్లో నింపుకున్నవారు ఇక ప్రశాంతంగా నిద్రపోలేరని హెచ్చరించారు. ప్రభుత్వ చర్యలతో నిజాయితీపరుల్లో విశ్వాసం పెరుగుతోందని, నిజాయితీకి ఇక అన్నీ మంచి రోజులేనని ప్రకటించారు. గత మూడేళ్లలో 1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం గుర్తించిందని, చాలామంది నల్లధనాన్ని షెల్ కంపెనీల్లో దాచారని, అందుకే వాటిని రద్దు చేశామని ప్రధాని తెలిపారు. దాదాపు 400 షెల్ కంపెనీలు ఒకే చిరునామా నుండి పని చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోందని, పన్ను ఎగవేతదారులు, అధికారులు కుమ్మక్కు కావటం వల్లే ఇది సాధ్యమైందని మండిపడ్డారు. కాగా, వడ్డీరేట్లు మరింతగా తగ్గుముఖం పడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా మెరుగుపడుతుందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని, డిజిటల్ చెల్లింపులు 34 శాతం పెరిగాయని ప్రధాని వివరించారు. ఆర్థిక వ్యవస్థ, లావాదేవీల్లో పారదర్శకతను తెచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఈ సంవత్సరం రెండింతలు అయిందని, నిరుడు 22 లక్షల మంది పన్ను చెల్లిస్తే, ఈ సంవత్సరం వీరి సంఖ్య 56 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా మారాయని, రాష్ట్రాల మధ్య చెక్‌పోస్టులు తొలగిపోవడం వల్ల 30 శాతం సరకు రవాణా పెరిగిందని, వేల కోట్ల రూపాయల్లో పన్ను ల చెల్లింపులు ఆదా అయ్యాయని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా గత నెల జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యా నికి హానికరం చేసే ఉత్పత్తులపై గరిష్ఠ పన్ను 28కితోడు 43 శాతం వరకు అదనపు పన్ను భారాన్ని మోపారు.

చిత్రం.. ఎర్రకోట వద్ద ప్రసంగిస్తున్న మోదీ