బిజినెస్

ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షీణించిన క్యాడిలా హెల్త్‌కేర్ లాభం
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఔషధ రంగ సంస్థ క్యాడిలా హెల్త్‌కేర్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 65.26 శాతం క్షీణించి 138.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 398.4 కోట్ల రూపాయలగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 2,228.8 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,333.1 కోట్ల రూపాయలుగా ఉంది.
పెరిగిన కుమ్మిన్స్ ఇండియా లాభం
ఇంజిన్ తయారీదారు కుమ్మిన్స్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో చూస్తే 22.61 శాతం పెరిగి 222.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 181.18 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,387.69 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 1,317.42 కోట్ల రూపాయలుగా ఉంది.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్
లాభం రూ. 185 కోట్లు
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 93 శాతం ఎగిసి 184.80 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 95.90 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఇక ఆదాయం ఈసారి 1,192.27 కోట్ల రూపాయలుగా, పోయినసారి 862.87 కోట్ల రూపాయలుగా ఉంది.