బిజినెస్

అమ్మకానికి టాటా స్టీల్ బ్రిటన్ ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: టాటా స్టీల్ బ్రిటన్ ఆస్తుల కొనుగోలు రేసులో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్ కూడా ఉంది. దీన్ని జెఎస్‌డబ్ల్యు స్టీల్ ధ్రువీకరించింది కూడా. సంస్థ వృద్ధిలో భాగంగా వివిధ సంస్థల వ్యాపారాలను కొనుగోలు చేసే దిశగా వెళ్తున్నామని, ఇందులో బ్రిటన్ టాటా స్టీల్ కూడా ఉందని ఓ ప్రకటనలో మంగళవారం జెఎస్‌డబ్ల్యు స్టీల్ తెలిపింది. కాగా, తమ బ్రిటన్ టాటా స్టీల్ ఆస్తుల కొనుగోలుకు ఏడు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని, వాటి సమ్మతిని మాకు తెలియబరిచాయని సోమవారం టాటా స్టీల్ తెలిపింది. ఈ నేపథ్యంలో జెఎస్‌డబ్ల్యు.. కొనుగోలు రేసులో తాము కూడా ఉన్నట్లు ప్రకటించింది. సౌత్ వేల్స్‌లోని పోర్ట్ తల్బోట్ ప్లాంట్‌సహా టాటా స్టీల్ బ్రిటన్ ఆస్తులన్నింటిని టాటా గ్రూప్ అమ్మేందుకు సిద్ధమైంది. బ్రిటన్‌లో వేలాది మంది కార్మికులతో అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థగా టాటా స్టీల్ కొనసాగిన విషయం తెలిసిందే. పోర్ట్ తల్బోట్ ప్లాంట్‌లో దాదాపు 4,000 మంది పనిచేస్తుండగా, న్యూపోర్ట్ వద్దనున్న కర్మాగారంలో మరో 1,300లకుపైగా కార్మికులు పనిచేస్తున్నారు. రోదర్హామ్ ప్లాంట్‌లోనూ 1,200 మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన టాటా స్టీల్.. బ్రిటన్ ఆస్తుల అమ్మకానికి సిద్ధమైంది. కాగా, 11 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆస్తులతో ఉన్న జెఎస్‌డబ్ల్యు స్టీల్.. కర్నాటక, తమిళనాడు, మహారాష్టల్రలో స్టీల్ ప్లాంట్లను కలిగి ఉంది. ఏటా 18 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం దీని సొంతం. నిజానికి ఇటీవలికాలంలో ఇతర సంస్థల ఆస్తుల కొనుగోలులో జెఎస్‌డబ్ల్యు స్టీల్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తన తమ్ముడు నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పాదక ప్లాంట్‌ను 6,500 కోట్ల రూపాయలకు సజ్జన్ జిందాల్ చేజిక్కించుకున్నారు. ఈ డీల్ విలువ 4,000 కోట్ల రూపాయలే అయినప్పటికీ, ఈ ప్లాంట్ దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అదనంగా మరో 2,500 కోట్ల రూపాయలు చెల్లించనుంది. అలాగే 1,391 మెగావాట్ల జైప్రకాశ్ హైడ్రో-పవర్ ప్లాంట్లనూ జెఎస్‌డబ్ల్యు ఇప్పటికే హస్తగతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న జైప్రకాశ్ 500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌నూ చేజిక్కించుకునేందుకు జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ చర్చలు జరుపుతోంది. అంతేగాక ఒడిషాలోని మొనె్నట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ 1,050 మెగావాట్ల పవర్ ప్లాంట్‌నూ కొనుగోలు చేసేందుకు జెఎస్‌డబ్ల్యు సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 11,500 మెగావాట్లకు తీసుకెళ్ళనుంది.