బిజినెస్

స్మాల్, మిడ్-క్యాప్‌లదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారీ సంస్థల కంటే చిన్న, మధ్య శ్రేణి సంస్థల్లో పెట్టుబడులే మదుపరులకు అధిక లాభాలను అందిస్తున్నాయి. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అన్న సూత్రం స్టాక్ మార్కెట్లలోని స్మాల్, మీడియం సూచీలకు చక్కగా సరిపోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇదే జరిగింది మరి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లో బ్లూచిప్ సూచీ సెనె్సక్స్‌తో పోల్చితే స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలే మదుపరులకు అమితంగా లాభాలను తెచ్చిపెట్టాయి.
వీటిల్లో పెట్టిన పెట్టుబడులు 28 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి చూస్తే ఇప్పటివరకు బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ సూచీ 27.91 శాతం లేదా 3,363.07 పాయింట్లు ఎగిసింది. అలాగే మిడ్-క్యాప్ సూచీ 25.44 శాతం లేదా 3,061.28 పాయింట్లు ఎగబాకింది. ఇదే సమయంలో సెనె్సక్స్ 18.11 శాతం వృద్ధికే పరిమితమైంది. దీంతో 30 భారీ సంస్థలున్న సెనె్సక్స్‌లో పెట్టిన పెట్టుబడుల కంటే వందలాది చిన్న, మధ్యతరహా సంస్థలున్న స్మాల్, మిడ్-క్యాప్ సూచీల్లో పెట్టిన పెట్టుబడులకు మదుపరులు ఎక్కువ లాభాలను అందుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు.. దేశీయ పరిస్థితులు కావచ్చు.. చిన్న, మధ్య శ్రేణి సంస్థల షేర్లను తక్కువగా ప్రభావితం చేస్తుండటమే దీనికి కారణం. ప్రతి చిన్న విషయానికీ ప్రభావితమయ్యే సెనె్సక్స్ షేర్లు.. మదుపరులకు తెస్తే భారీ లాభాలను, లేకపోతే పెద్ద ఎత్తున నష్టాలను అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ సంఖ్యలో ఉండే రిటైల్ మదుపరులు సహజంగానే చిన్న, మధ్య శ్రేణి సంస్థల్లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉండాలనే ఆలోచన కూడా దీనికి కారణమే. నిజానికి సెనె్సక్స్‌లోని భారీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేది ఎక్కువగా ఎల్‌ఐసి వంటి సంస్థాగత మదుపరులే. రిటైల్ మదుపరులు వీటి జోలికి వెళ్లడం చాలాచాలా అరుదు. వెళ్లినా తక్కువ స్థాయిలోనే పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే ఆయా సంస్థల షేర్ల విలువ అధికంగా ఉండటం, పెద్ద సంస్థల షేర్లలో ఒక్కదాని విలువకే స్మాల్, మిడ్-క్యాప్ షేర్లు ఎక్కువగా రావడం కారణం. దీంతో మదుపరుల ఆలోచన, పరిస్థితులకు తగ్గట్లుగానే స్మాల్, మిడ్-క్యాప్ సూచీలు లాభాలను అందిస్తున్నాయి. ఇకపోతే ఈ ఏడాదిలో సెనె్సక్స్ 4,822.57 పాయింట్లు పెరిగితే, ఈ నెల 2న 32,686.48 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అలాగే స్మాల్-క్యాప్ సూచీ ఈ నెల 8న 15,642.07 పాయింట్ల ఆల్‌టైమ్ హైని, మిడ్-క్యాప్ సూచీ గత నెల జూలై 26న 16,186.13 పాయింట్ల ఆల్‌టైమ్ హైని చేరాయి. గత వారం సెనె్సక్స్ 1,111.82 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నిఫ్టీ 355.60 పాయింట్లు నష్టపోయినది తెలిసిందే. అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఆందోళనకర పరిస్థితులు, డొల్ల కంపెనీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించడం వంటివి కారణం. సెనె్సక్స్ సంస్థల మార్కెట్ విలువలో సగటున ఐదో వంతున్నవి మిడ్-క్యాప్‌లో, పదో వంతున్నవి స్మాల్-క్యాప్‌లో ఉంటాయి.