బిజినెస్

బైబ్యాక్‌పై 19న ఇన్ఫోసిస్ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 17: దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు రూ. 13 వేల కోట్లరూపాయల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై శనివారం (19న) నిర్ణయం తీసుకోనుంది. షేర్ల బైబ్యాక్ అనేది 36 ఏళ్ల ఇన్ఫోసిస్ చరిత్రలోనే మొదటిసారి . కాగా కంపెనీ వద్ద ఉన్న మిగులు నిధుల్లో కొంతభాగాన్ని వాటాదారులకు తిరిగి చెల్లించాలని కంపెనీ వ్యవస్థాపకులు, మాజీ ఉన్నతాధికారులు చాలా కాలంగా కోరుతూ ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌కు తలొగ్గిన ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డివిడెండ్, లేదా షేర్ల బైబ్యాక్ రూపంలో రూ 13 వేల కోట్లను వాటాదారులకు తిరిగి చెల్లిస్తామని గత ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. షేర్ల బైబ్యాక్ నిబంధనను చేరుస్తూ కంపెనీ ఇటీవల తన నిబంధనావళిలో మార్పులు కూడా చేసింది. ‘2017 ఆగస్టు 19న జరిగే ఇన్ఫోసిస్ డైరెక్టర్లబోర్డు సమావేశంలో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు సంబందించిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకొంటుంది’ అని ఇన్ఫోసిస్ మార్కెట్ రెగ్యులేటర్ సెబికి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పంపిన లేఖలో తెలిపింది. అయితే దీనికి సంబంధించిన వివరాలేమీ కంపెనీ అందులో పేర్కొనలేదు. ఈ ప్రకటనకు సానుకూలంగా స్పందించిన ఇన్ఫోసిస్ షేర్లు గురువారం దాదాపు 4.5 శాతం పెరిగి ఒక్కో షేరు 1021 రూపాయలకు చేరుకొంది. ట్రేడింగ్ విండో తక్షణం మూతపడి తిరిగి ఈ నెల 22న తెరుచుకుంటుందని ఇన్ఫోసిస్ తెలిపింది. రూ. 13 వేల మిగులు నిధుల కేటాయింపునకు సంబంధించి తగిన పంపిణీ విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నట్లు ఇన్ఫోసిస్ ఈ ఏడాది జూన్‌లో జరిగిన కంపెనీ సర్వసభ్య సమావేశం( ఎజిఎం) సందర్భంగా తెలిపింది. ఇన్ఫోసిస్‌కు పెద్ద సంఖ్యలో వాటాదారులుండడంతో పాటుగా అనేక దేశాల్లో కంపెనీ షేర్లు లిస్టింగ్ అయినందున వాటాదారులకు ఏ విధంగా పంపిణీ చేయాలనేది ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుందని అప్పట్లో ఇన్ఫోసిస్ చైర్మన్ ఆర్ శేషసాయి చెప్పారు. ఐటి రంగంలో ఇన్ఫోసిస్‌కు ప్రధాన పోటీదారయిన టిసిఎస్ రూ 16 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించగా, కాగ్నిజంట్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీ, మైండ్‌ట్రీలాంటి సంస్థలు కూడా ఇదే తరహా ప్రకటనలు చేయడం తెలిసిందే.