బిజినెస్

రిటైల్ లో చైనాను అధిగమించిన భారత్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అంతర్జాతీయ రిటైల్ మార్కెట్ అభివృద్ధి సూచీ (గ్లోబల్ రిటైల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్)లో మన దేశం చైనాను అధిగమించింది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత రిటైల్ మార్కెట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘సిబిఆర్‌ఇ సౌత్ ఏషియా’ తన నివేదికలో పేర్కొంది. 2017 సంవత్సర ప్రథమార్థంలో ఏడు కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు భారత రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించాయని, దీంతో ఈ రంగంలో పెట్టుబడులు 200 మిలియన్ డాలర్లకు చేరాయని దేశీయ రిటైల్ మార్కెట్ తీరుతెన్నులపై రూపొందించిన సమీక్షా నివేదికలో సిబిఆర్‌ఇ వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటికే భారత రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించిన అంతర్జాతీయ బ్రాండ్లు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాయని, ‘బిగ్ బజార్’ సహా అనేక హైపర్ మార్కెట్లు ముంబయి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కొత్త స్టోర్లను ప్రారంభించి తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నాయని, అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో ‘మ్యాక్స్’, ‘పాంటలూన్స్’ లాంటి రిటైల్ వస్త్ర వ్యాపార సంస్థలు కూడా చురుకుగా ముందుకు సాగుతున్నాయని సిబిఆర్‌ఇ వివరించింది.