బిజినెస్

అమెరికాతో మళ్లీ చమురు వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 17: అభివృద్ధి అవసరాల నిమిత్తం భారత్‌కు దీర్ఘ కాలం పాటు ముడి చమురును సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ చమురు వ్యాపారం మొదలైంది. దీంతో అమెరికా నుంచి తొలుత దిగుమతి అవుతున్న 100 మిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు వచ్చే నెలలో మన దేశానికి చేరుకోనుంది. భారత్‌కు చమురు సరఫరా చేయకుండా నాలుగు దశాబ్దాల క్రితం అగ్రరాజ్యం విధించిన నిషేధాన్ని రెండేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ట్రంప్ జూన్ 26వ తేదీన తొలిసారి సమావేశమై ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించారు. ఆ తర్వాత భారత సంస్థలు అమెరికా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ప్రారంభించాయి. ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలోని దిగ్గజ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం సంస్థలు అమెరికా నుంచి 40 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చాయి. దీంతో ప్రపంచంలో అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మూడవదిగా ఉన్న మన దేశం అమెరికా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న దక్షిణ కొరియా, జపాన్, చైనా తదితర దేశాల సరసన చేరనుంది.