బిజినెస్

స్వల్ప లాభాలతో సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 17: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో గురువారం వరసగా మూడో రోజూ లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ లాభాలన్నిటినీ కోల్పోయి చివరికి 24 పాయింట్ల స్వల్ప లాభాలకే పరిమితమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం కేవలం 7 పాయింట్లే లాభపడింది.
నిన్న 300 పాయింట్లకు పైగా లాభపడిన సెనె్సక్స్ గురువారం ఉదయం కూడా ఉత్సాహంగానే నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలోనే మొదలైంది. ఒక దశలో సెనె్సక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడి 31,937.51 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే చివర్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒత్తిడికి లోనయిన సూచీ కేవలం 24.57 పాయింట్ల లాభానికే పరిమితమై 31,795.46 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 6.85 పాయింట్లు పెరిగి 9,904.15 పాయింట్ల వద్ద ముగిసింది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై శనివారం నిర్ణయం తీసుకుంటామని దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేరు అత్యధికంగా 4.5 శాతం పెరిగింది. కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు కూడా లాభపడ్డాయి. ఐటి, టెక్నాలజీ, పిఎస్‌యు షేర్లు నిలదొక్కుకోగా, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టపోయాయి. ఉత్తర కొరియా ఉద్రిక్తత సడలినప్పటికీ ప్రధాన ఆసియా మార్కెట్లు అనిశ్చితినుంచి పూర్తిగా బైటపడలేదు. ఐరోపా మార్కెట్లు కూడా ప్రారంభంలోనే నష్టాలతో మొదలైనాయి.