బిజినెస్

ఇపిఎఫ్ వడ్డీ రేటుపై త్వరలో ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును త్వరలో జరుగనున్న ట్రస్టీల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. దేశంలోని 4.5 కోట్ల మందికిపైగా పిఎఫ్ చందాదారులకు 2015-16లో 8.8 శాతం వడ్డీ చెల్లించిన ఇపిఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దానిని 8.65 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎఫ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ చెల్లించాలన్న విషయాన్ని ఇపిఎఫ్‌ఓ కేంద్ర ట్రస్టు బోర్డు సభ్యుల సమావేశంలో చర్చించిన తర్వాత తమ శాఖ నిర్ణయం తీసుకుంటుందని, ఈ సమావేశం ఈ నెలలోనే జరుగుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విలేఖరులకు తెలిపారు.