బిజినెస్

శాశ్వతంగా పెరగనున్న ప్రభుత్వ రాబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతమవడం కొత్తగా ఎంతో మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చి ప్రభుత్వ రెవెన్యూ రాబడులు స్థిరంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం అనేక మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి రావడంతో పాటు క్షమాదాన పథకం ద్వారా భారీ మొత్తంలో అప్రకటిత సొమ్ము వెలుగులోకి తీసుకురావడంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ అదనపు పన్ను ఆదాయాన్ని సృష్టించుకోగలిగిందని, దీంతో రాష్ట్రాల నుంచి వచ్చే వాటాలు సహా స్థూల పన్ను ఆదాయం బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని (10.8 శాతం) కూడా అధిగమించి 11.3 శాతానికి చేరుకుందని, పెట్రోలియం ఉత్పత్తులపై వచ్చిన ఎక్సైజ్ వసూళ్లు అంచనాలకు మించి ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకు తమ నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ ప్రత్యక్ష పన్ను రాబడులపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తటస్థంగానే ఉందని, అందుకే అవి 5.6 శాతంగా నిర్ధేశించుకున్న బడ్జెట్ లక్ష్యానికి లోబడే ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ‘పన్నుల పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచే విషయంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతమైతే కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడులు శాశ్వతంగా పెరగవచ్చు’ అని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.