బిజినెస్

పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సహజవాయువులాంటి పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను లేదా విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. పెట్రోలియం ఉత్పత్తులను గత జూలై 1నుంచి అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) పరిధినుంచి మినహాయించినప్పటికీ జిఎస్‌టి పరిధిలోకి వచ్చే వస్తువుల్లో ఇన్‌పుట్స్‌గా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ‘జిఎస్‌టి పన్ను విధానంలోకి మారిన కారణంగా పెట్రోలియం ఉత్పత్తులను ఇన్‌పుట్స్‌గా ఉపయోగించే వస్తువుల ధరల్లో పెరుగుదలకు సంబంధించి దేశంలోని ఉత్పాదక రంగం లేవనెత్తుతున్న ఆందోళనను ఆర్థిక మంత్రి తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు’ అని శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన అధికారిక ప్రకటన తెలిపింది.
సహజవాయువును విద్యుత్ ఉత్పత్తితో పాటుగా ఎరువుల తయారీ, పెట్రో కెమికల్స్‌తో పాటుగా గాజులాంటి అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ముడి చమురును పెట్రోలు, డీజిలుతో పాటుగా కిరోసిన్, నాఫ్తా, ఫ్యూల్ ఆయిల్ లాంటి పారిశ్రామిక ఇంధనాలు, బిటుమన్(తారు) లాంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. మిగతా పరిశ్రమలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందగలుగుతుండగా, పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధినుంచి మినహాయించిన కారణంగా వీటిని ఇన్‌పుట్స్‌గా ఉపయోగించే పరిశ్రమలు ఈ సదుపాయాన్ని పొందలేవు. ఫలితంగా వీటిని ఉపయోగించి ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. జిఎస్‌టిని ప్రవేశపెట్టిన తర్వాత వస్తువుల తయారీకి ఇన్‌పుట్స్‌గా ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) భారాన్ని తగ్గించాలని కోరుతూ జైట్లీ ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు ఆ అధికారిక ప్రకటన తెలిపింది. కొన్ని రాష్ట్రాలు వస్తువుల తయారీకి ఉపయోగించే సిఎన్‌జిపై వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించగా, మరి కొన్ని రాష్ట్రాలు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. డీజిల్‌పై వ్యాట్ ఢిల్లీలో 17.4 శాతం మాత్రమే ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 31.06 శాతం ఉంది. అలాగే సహజవాయుపై కూడా వ్యాట్ 0-15 శాతం మధ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది.
అందువల్ల జిఎస్‌టి ఉండే వస్తువుల తయారీకోసం ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రేటును తగ్గించే అవకాశాలను పరిశీలించాలని, దీనివల్ల వాటి ధరల్లో వీలయినంత తక్కువ తేడా ఉండేలా చూడాలని జైట్లీ మిగతా రాష్ట్రాలను కోరినట్లు ఆప్రకటన తెలిపింది.