బిజినెస్

9.6% క్షీణించిన ఇన్ఫోసిస్ షేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామాతో ఆ కంపెనీ షేరు ఒక్కసారిగా పేకమేడలా పతనమైంది. బిఎస్‌ఇలో ఒక దశలో ఆ కంపెనీ షేరు 13.39 శాతం పడిపోయి 52 వారాల కనిష్టస్థాయి అయిన రూ.884.40 స్థాయికి దిగజారింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకొన్నప్పటికీ చివరికి 9.6 శాతం నష్టంతో రూ. 923.10 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజిలో సైతం ఇదే ధోరణి కనిపించింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర వెయ్యి రూపాయల పైనే ఉండింది. ఇన్ఫోసిస్ షేరు దారుణంగా పడిపోయిన ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్ విలువ సైతం ఒక్క రోజే రూ.24,839 కోట్లు పడిపోయి రూ.2,12,033 కోట్లకు చేరుకొంది. ఇన్ఫోసిస్‌లో వాటాలు కలిగి ఉన్న కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కుటుంబ సభ్యులకే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేరకు నష్టం వచ్చి ఉంటుందని అంచనా.