బిజినెస్

కెటిపిపి రెండో దశలో మళ్లీ సాంకేతిక సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మే 12: వరంగల్ జిల్లా పరకాలలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రెండోదశ తరుచూ సాంకేతిక కారణాలతో ఆగుతోంది. నాలుగు నెలల్లో సుమారు 10 సార్లు ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు సమాచారం. కెటిపిపి రెండో దశలో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఇంజనీర్‌లను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ప్రాజెక్ట్ కొత్తది కాబట్టి సాంకేతిక లోపాలు ఏర్పడడం సహజమని, కొత్త కారణాలతో యూనిట్ నిలిచిపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్లాంట్‌లో బారింగ్ గేర్, బాయిలర్ ట్యూబ్‌ల లీకేజీల సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత నెల ఏప్రిల్ 28న ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్‌ల లీకేజీ సమస్యతో ప్లాంట్‌ను నిలిపి వేసిన అధికారులు బారింగ్ గేర్‌లో కూడా సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. బాయిలర్ ట్యూబ్‌లకు సంబంధించిన మరమ్మతు పనులను ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. మరమ్మతులు సకాలంలో పూర్తయితే శుక్రవారం గాని, శనివారం నాటికి 600 మెగావాట్ల కెటిపిపి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తరుచూ ఇదే తంతు
జనవరి 5న ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారికంగా కెటిపిపి-2 ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అయితే ప్రాజెక్ట్ తరుచూ సాంకేతిక కారణాలతో తరుచూ ఆగుతోందనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా నాలుగు నెలల్లో 10సార్లు ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్త ప్రాజెక్ట్ కావడంతో సాంకేతిక కారణాలు సహజమనే కోణంలో ఇంజనీర్లు ప్లాంట్‌లో మరమ్మతులు జరిపి మార్చి 24న అధికారికంగా సివోడిని నిర్వహించారు. అప్పటినుండి ప్రాజెక్ట్ వాణిజ్య పరంగా ఆదాయ మార్గంలోకి వచ్చింది. ఏప్రిల్ 2న మళ్లీ మరమ్మతుకు గురై రెండు రోజుల పాటు నిలిచి పోయింది. 24న మళ్లీ నిలిచి పోగా ఇంజనీర్లు మరమ్మతులు జరిపి ప్రాజెక్ట్‌ను నడిపించారు. తాజాగా గత నెల 28న ఉత్పత్తి నిలిచిపోయంది. దీంతో రెండు రోజుల క్రితం జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు కెటిపిపి రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌ను సందర్శించి పరిశీలించారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రెండో దశ 600 మెగావాట్లలో సమస్యలపై అధికారులతో చర్చించారు. మరమ్మతు పనులు పూర్తి చేసి శుక్రవారం సాయంత్రం సింక్రనైజేషన్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చిత్రం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు