బిజినెస్

ఇన్ఫోసిస్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశీయ ఐటి రంగ ప్రముఖుల్లో ఒకరైన ఇన్ఫోసిస్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా తన పదవుల నుంచి తప్పుకున్నారు. ఇన్ఫోసిస్‌కు తొలి వ్యవస్థాపకేతర సిఇఓగా సేవలు అందించిన ఆయన తన పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేశారు. సిక్కాపై సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ ఎన్‌ఆర్.నారాయణ మూర్తి విమర్శల దాడిని కొనసాగించడమే ఆయన రాజీనామాకు కారణమని ఇన్ఫోసిస్ శుక్రవారం వెల్లడించింది. గతంలో జర్మన్ ఐటి దిగ్గజ సంస్థ శాప్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన సిక్కా (50) హయాంలో ఇన్ఫోసిస్ సంస్థ ఆదాయం 25 శాతం పెరిగింది. అయితే తన రాజీనామాకు నారాయణ మూర్తే కారణమని సిక్కా నేరుగా ప్రకటించలేదు. కానీ తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు పెరగడం వల్లనే పదవులకు రాజీనామా చేశానని సిక్కా స్పష్టం చేశారు.
సరైన సమయంలో స్పందిస్తా : నారాయణమూర్తి
కాగా, సిక్కా రాజీనామా వ్యవహారం నేపథ్యంలో ఇన్ఫోసిస్ బోర్డు తనకు వ్యతిరేకంగా ఆరోపణలు, తప్పుడు ప్రకటనలు చేయడం తీవ్రమైన ఆవేదన కలిగించిందని, ఇటువంటి నిరాధారమైన ఆరోపణలపై స్పందించడం తన గౌరవాన్ని దిగజార్చుకోవడమే అవుతుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు. తనపై బోర్డు చేసిన ఆరోపణలకు సమయం వచ్చినప్పుడు సరైన వేదికపై తగిన సమాధానమిస్తానని ఆయన స్పష్టం చేశారు. సిక్కా హయాంలో సంస్థ కార్పొరేట్ పాలన (కార్పొరేట్ గవర్నెన్స్) సరిగా లేదని చాలా కాలం నుంచి విమర్శలు గుప్పిస్తున్న నారాయణ మూర్తి సంస్థ ఉన్నతాధికారుల (ఎగ్జిక్యూటివ్‌ల) వేతనాల పెంపు సరికాదని పదే పదే ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సిక్కా హయాంలో ఇన్ఫోసిస్ జరిపిన కొనుగోళ్లపై కూడా ఆయన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ మూర్తి నేతృత్వంలోని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, సంస్థ బోర్డుకు మధ్య దాదాపు ఏడాది కాలం నుంచి కొనసాగుతున్న విభేదాలకు పర్యవసానంగానే సిక్కా తన పదవులకు రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రత్యేకించి సిక్కా ఇన్ఫోసిస్‌కు సిఇఓగా కంటే సిటిఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)గా బాగా సరిపోతారని పేర్కొంటూ స్వతంత్ర డైరెక్టర్లు ఇటీవల నారాయణ మూర్తికి పంపిన ఇ-మెయిల్ మీడియాకు లీక్ అవడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి సిక్కా రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది.