బిజినెస్

‘ఇన్ఫీ’ దెబ్బకు మార్కెట్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో గత మాడు రోజులుగా లాభాల బాటలో సాగిన ప్రధాన సూచీలు వారాంతపు రోజయిన శుక్రవారం నాడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం బలహీనంగా మొదలయిన మార్కెట్లకు ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి సిక్కా రాజీనామా వార్త శరాఘాతమైంది. మరోవైపు స్పెయిన్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఫలితంగా ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెనె్సక్స్ చివర్లో కొంతమేరకు కోలుకొని 271 పాయింట్ల నష్టంతో 31,524.68 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 9800 పాయింట్ల దిగువకు పడిపోయిన నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ చివర్లో కాస్త కోలుకొని ఎట్టకేలకు 9800 పాయింట్ల ఎగువన ముగిసింది. మొత్తంమీద 67 పాయింట్ల నష్టంతో 9837.40 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెనె్సక్స్ దాదాపు 582 పాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా 311 పాయింట్ల మేర లాభంతో ముగియడం గమనార్హం. గత ఏడు వారాల్లో మార్కెట్లు లాభాల్లో ముగియడం ఇది ఆరో వారం. ఒక దశలో ఇన్ఫోసిస్ షేరు 14 శాతం పడిపోయినప్పటికీ చివరికి కాస్త కోలుకొని 9.50 శాతం నష్టంతో సరిపెట్టుకొంది. ఇన్ఫోసిస్ ప్రభావం బిఎస్‌ఇ ఐటి సూచీపై తీవ్రంగా కనిపించింది. ఈ సూచీ దాదాపు 3.5 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్‌కు తోడు సన్‌ఫార్మా, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి, కోల్‌ఇండియా లాంటి ప్రధాన షేర్లు కూడా భారీగా నష్టపోవడం మార్కెట్ల పతనానికి మరింత తోడైంది. అయితే హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, టిసిఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహింద్ర, మహింద్ర లాంటి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో పతనం కొంతమేరకే పరిమితమైంది. కాగా, ఆసియాలోని మిగతా ప్రధాన మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా లావాదేవీల ప్రారంభంలోనే నష్టాలతో మొదలైనాయి.