బిజినెస్

దేశాభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: దేశాభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర వహిస్తోందని జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ-దక్షిణాది) ఉపాధ్యక్షుడు ఆర్ చలపతిరావు అన్నారు. స్థిరాస్తి రంగం వృద్ధి చెందితే ఆర్థిక అభివృద్ధి కాకుండా ఉపాధి అవకాశాలూ భారీగా పెరుగుతాయని చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 28, 29 తేదీల్లో జిఎస్‌టి అమలు తర్వాత ప్రభావం, కొత్త స్థిరాస్తి చట్టం ‘రెరా’ వల్ల ఒనగూరే ప్రయోజనాలు, ఈ రంగం భవిష్యత్ వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించేందుకుగాను జాతీయ స్థాయి సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్థిరాస్తి రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పెట్టుబడి అవకాశాలు ఏ మేరకు ఉంటాయనే కోణంలో అభిప్రాయాలను ఒకరి నుంచి ఒకరు తెలుసుకునేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. జాతీయ సదస్సుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ రంగ నిపుణులు, స్థిరాస్తి రంగ వ్యాపారులు, తదితరులు హాజరవుతారని చెప్పారు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జి హరిబాబు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ పి ప్రేమ్‌కుమార్‌లు మాట్లాడుతూ జాతీయ సదస్సు వేదికగా అనేక అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి రంగ అభివృద్ధికి ఉజ్వల భవిష్యత్ ఉందని అన్నారు.
రెరా చట్టం వల్ల పారదర్శకత పెరగడం ద్వారా వ్యాపార వృద్ధికి మరింత అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సదస్సు వద్ద స్థిరాస్తి రంగ ప్రాజెక్టులు వంటివి, కొత్త ఆలోచనలు, విధానాలు గురించి ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రేమ్‌కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.