బిజినెస్

సోషల్ మీడియాలోకి ఈపిడిసిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: భారతీయ రైల్వే తరహాలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఫేస్‌బుక్, ట్విట్టర్ హ్యాండిల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల వినియోగదారులు నేరుగా సంస్థ యాజమాన్యంతో సంబంధాలు ఏర్పర్చుకుని పలు ఆకర్షణీమైన పథకాల గురించి నేరుగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆకర్షణీయమైన పథకాలకు సంబంధించి వినియోగదారులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయవచ్చు. వినియోగదారులు దీని ద్వారా సంస్థ యాజమాన్యం నుంచి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల వరకు ఎవరికైనా ఫిర్యాదులు చేసుకోవచ్చు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగు తుందని సంస్థ భావిస్తోంది. భవిష్యత్‌లో అమలయ్యే పథకాల గురించి ఈ విధానం ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని సంస్థ నిర్ణయించింది. సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి, స్పందన కార్యక్రమాలకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. వినతుల సమర్పించుకునేందుకు అనేకసార్లు తిరిగాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వినియోగదారుల కష్టాలు ఇకపై తీరినట్టే. విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణ పరిష్కారానికి సోషల్ మీడియా వేదిక కానుంది.