బిజినెస్

సింగరేణి లాభం రూ. 395 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 19: సింగరేణి కాలరీస్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 395.4 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందింది. 17,853 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ఎన్ శ్రీ్ధర్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ 541వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2016-17 ఆర్థిక వార్షిక లెక్కలను, ఆమోదం తెలిపిన వివరాలను వెల్లడించారు. పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 2,888 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వానికి 3,168 కోట్ల రూపాయలను సింగరేణి చెల్లించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి 30 కోట్ల రూపాయలను కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే మూడు కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులను ఇచ్చారు. మంచిర్యాల ఏరియాలోని ఇందారం ఓపెన్‌కాస్టు, భూపాలపల్లి ఏరియాలోని కెటికె ఓపెన్‌కాస్టు-2, మందమర్రిలోని శాంతిగని లాంగ్‌వాల్‌లకు బడ్జెట్‌ను కేటాయిస్తు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి అజయ్ మిశ్రా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ జెఎస్ బింద్రా, సింగరేణి కాలరీస్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్‌రావు, ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఇంజినీరింగ్ అండ్ మైనింగ్ డైరెక్టర్ ఎస్ శంకర్, కంపెనీ కార్యదర్శి జి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

చిత్రం..బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న సింగరేణి సిఎండి శ్రీ్ధర్