బిజినెస్

అందరి మంచికే దివాళా చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: కొత్త దివాళా చట్టం రుణ గ్రహీతలకు-రుణ దాతలకు మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఎన్‌పిఎ రెజల్యూషన్ (నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిల తీర్మానం) అనేది అప్పుల్లో కూరుకుపోయిన సంస్థల నగదీకరణకే కాకుండా, సదరు సంస్థల యాజమాన్యాన్ని రక్షిస్తుందని అన్నారు. శనివారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ నిర్వహించిన దివాళా సదస్సులో పాల్గొన్న జైట్లీ పైవిధంగా స్పందించారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల స్థాయి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. మొండి బకాయిలపై అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బిఐ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఇదిలావుంటే దివాళా చట్టం (ఐబిసి).. కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌లోకి మదుపరుల రాకను పెంచగలదని, వారిలో పెట్టుబడులపట్ల విశ్వాసాన్ని పెంపొందించగలదన్న ఆశాభావాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపార, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న జైట్లీ