బిజినెస్

విస్తరణ దిశగా ట్రూజెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: హైదరాబాద్ ఆధారిత ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్.. విస్తరణ బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ పథకంలో భాగంగా మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చికల్లా తమ విమానాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకోవాలని చూస్తున్న ట్రూజెట్.. ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు దాదాపు 50 విమానాలు తిరిగేలా ప్రణాళికలు వేస్తోంది. ఉడాన్ కింద దేశంలోని 18 మార్గాల్లో విమాన సర్వీసులు నడిపేందుకు ట్రూజెట్‌కు అనుమతులు వచ్చాయి. కాగా, టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రమోట్ చేస్తున్న ట్రూజెట్‌కు ప్రస్తుతం 5 విమానాలుండగా, దేశంలోని వివిధ ప్రాంతాలకు 31 సర్వీసులను నిర్వహిస్తోంది. వచ్చే నెలాఖరుకల్లా ఉడాన్ పథకంలో భాగంగా 18 మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు ట్రూజెట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వి ఉమేష్ పిటిఐకి తెలిపారు.