బిజినెస్

ఫోనిక్స్ గ్రూప్‌తో కాల్ హెల్త్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: అనుసంధానిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో అగ్రగామి సంస్థగా పేరొందిన కాల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. కాల్‌హెల్త్-హెల్త్‌కేర్ లాంజ్ ను హైదరాబాద్‌లోని ఐటి అనుబంధ రంగాల వ్యాపార కేంద్రం గచ్చిబౌలిలోని ఫోనిక్స్ అవాన్స్ సెజ్ వద్ద ప్రారంభించింది. అన్ని ఆరోగ్య సంరక్షణ సేవలకు వన్ డోర్ యాక్సెస్‌గా ఉండడంతోపాటు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు కంపెనీలలో పని చేస్తున్న 20 వేల మందికిపైగా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించనుంది. ఈ కార్యక్రమంలో ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి, టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమలతోపాటుగా కాల్‌హెల్త్ సీఈఓ హరి థలపల్లి పాల్గొన్నారు. ఫోనిక్స్ గ్రూప్‌తో కాల్‌హెల్త్ భాగస్వామ్యం ద్వారా కార్పొరేట్లు ఆరోగ్యం పట్ల దృష్టి కేంద్రీకరించగలుగుతారని, ఉద్యోగులు తమ గురించి తాము జాగ్రత్త తీసుకునేందుకు ప్రోత్సహించినట్లవుతుందని సురేష్ పేర్కొన్నారు. కాగా, హెల్త్ లాంజ్ రోజుకు 8 గంటలు, వారానికి ఐదు రోజులు పని చేస్తుంది.