బిజినెస్

రక్షణ, విమానయాన రంగాలకు కీ సైట్స్ టెక్నాలజీస్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: అంతరిక్ష, విమానయాన రంగ అప్లికేషన్లకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు కీసైట్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పని చేస్తోందని ఆ కంపెనీ కంట్రీ జనరల్ మేనేజర్ సుధీర్ తంగ్రి తెలిపారు. భారతదేశంలో ఏరో స్పేస్, డిఫెన్స్ మార్కెట్ అవసరాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గురువారం ఇక్కడ ఒక హోటల్‌లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సింపోజియం 2016ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సింపోజియంలో ఇంజినీర్లు, రక్షణ రంగ శాస్తవ్రేత్తలు పాల్గొన్నట్లు వెల్లడించారు. కీసైట్ తమ అత్యాధునిక డిజైన్, పరీక్షా పరిష్కారాలను ఆవిష్కరించిందని, తద్వారా కటింగ్ ఎడ్జ్ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్‌పై పని చేసే ఆయా సంస్థలు మెజర్‌మెంట్ ఇన్‌సైట్స్ ప్రారంభించేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. అంతరిక్ష, విమానయాన, రక్షణ రంగ ఎలక్ట్రానిక్స్‌లో నూతన ధోరణులు, రాడార్ మెజర్‌మెంట్ ఫండమెంటల్స్, కస్టమ్ మాడ్యులేట్ శాటిలైట్ సిగ్నల్ సిమ్యులేటింగ్, జనరేటింగ్, ఎనలైజింగ్‌తో పాటు రాడార్‌లో ఫోటోనిక్స్ వంటి వాటిలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అనే్వషించేందుకు కీసైట్స్ పని చేస్తోందని చెప్పారు. తమ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యిందని వెల్లడించారు.