బిజినెస్

విపణిలోకి మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి మోడల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెస్ బెంజ్.. సోమవారం భారతీయ విపణిలోకి ఎఎమ్‌జి జిటి ఆర్,
జిటి రోడ్‌స్టర్ మోడళ్లను తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూం ప్రకారం జిటి ఆర్ ప్రారంభ ధర 2.23 కోట్ల రూపాయలుగా ఉంటే,
జిటి రోడ్‌స్టర్ ప్రారంభ ధర 2.19 కోట్ల రూపాయలుగా ఉంది. కేవలం 3.6 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని జిటి ఆర్ అందుకోగలదని, 585 హెచ్‌పి ఇంజిన్ కలిగిన దీని గరిష్ఠ వేగం గంటకు 318 కిలోమీటర్లని ఈ సందర్భంగా సంస్థ తెలిపింది.
ఇక 476 హెచ్‌పి ఇంజిన్ సామర్థ్యం కలిగిన జిటి రోడ్‌స్టర్ గరిష్ఠ వేగం గంటకు 302 కిలోమీటర్లుగా ఉంది. కాగా, లగ్జరీ వాహనాలపై 25 శాతం సెస్సును ప్రభుత్వం అమల్లోకి తెస్తే కార్ల ధరలు 5 శాతం వరకు పెరుగుతాయని మెర్సిడెస్ తెలిపింది