బిజినెస్

కాంబీఫ్లామ్‌లో నాణ్యతా లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 12: దేశంలో ప్రజలు నొప్పి నివారణకు విరివిగా ఉపయోగిస్తున్న కాంబీఫ్లామ్ మాత్రల్లో నాణ్యత లోపించిందని కేంద్ర ఔషధ నాణ్యతాప్రమాణాల నియంత్రణా సంస్థ (సిడిఎస్‌సిఓ) గుర్తించింది. దీంతో భారత్ నుంచి కొన్ని బ్యాచ్‌లకు చెందిన కాంబీఫ్లామ్ మాత్రలను మార్కెట్ నుంచి వెనక్కి తీసేసుకుంటున్నామని (రీకాల్ చేస్తున్నామని) సనోఫీ సంస్థ గురువారం వెల్లడించింది. దేశంలో కొన్ని బ్యాచ్‌లకు చెందిన కాంబీఫ్లామ్ మాత్రలు డిజింటిగ్రేషన్ (జీర్ణ) పరీక్షల్లో విఫలమవడంతో వాటిలో నాణ్యత లోపించినట్లు గుర్తించామని ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాల్లో సిడిఎస్‌సిఓ తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది. ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ మింగిన తర్వాత ఎంతసేపటికి జీర్ణమవుతాయో తెలుసుకోవడంతో పాటు ఔషధాల నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించేందుకు డిజింటిగ్రేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. పారాసిటమాల్, బ్రూఫెన్ ఔషధాల కలయికతో రూపుదిద్దుకుంటున్న కాంబీఫ్లామ్ మాత్రలు భారత్‌లో సనఫో సంస్థకు చెందిన ఐదు పెద్ద బ్రాండ్లలో ఒకటిగా ఉంది. అయితే 2015 జూన్, జులై నెలల్లో ఈ సంస్థ ఉత్పత్తి చేసిన కాంబీఫ్లామ్ మాత్రలు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని సిడిఎస్‌సిఓ తమ నోటీసుల్లో పేర్కొంది.