బిజినెస్

సహజసిద్ధంగా పండ్లను మగ్గబెట్టే యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 12: రాష్ట్రంలో పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టే ప్రక్రియకు ఉపయోగించే యూనిట్లను ఏర్పాటుచేశామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలోని సిటిఆర్‌ఐ సమావేశ హాల్లో జరిగిన నర్సరీ రైతుల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యానికి హాని కలిగించే కార్బయిడ్ సహాయంతో మాగబెట్టే విధానానికి తావులేకుండా ఆరోగ్యకరమైన విధానంలో సహజసిద్ధంగా మాగబెట్టే ప్రక్రియకు ఉపయోగించే యూనిట్లను ఏర్పాటుచేశామన్నారు. కార్బయిడ్ విధానానికి స్వస్తిపలకడానికి ఇవి ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటికే 130 డెమో యూనిట్లు పంపిణీచేశామన్నారు. దీనికి అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించామన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా 23 మార్కెట్ యార్డుల్లో వీటిని ఏర్పాటుచేశామని, ఉద్యానవన శాఖ ద్వారా 222 యూనిట్లను సబ్సిడీపై రైతులకు అందించామని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఫ్లోరీ కల్చర్ అభివృద్ధికి రూ.10 కోట్లతో ప్రయోగశాలను ఏర్పాటుచేస్తున్నామని, ఇది ఏడాదిలోగా రైతులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఐసిఎఆర్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నర్సరీ రైతులకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించి కడియంలో సెంటరు ఏర్పాటుచేశామని తెలిపారు. దీనివల్ల నర్సరీ రైతులకు బహుళ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. నర్సరీ రైతుల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, సాయిల్ కోకోనట్ పిట్ యూనిట్‌ను రైతులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.