బిజినెస్

మెరిసిన బ్యాంకింగ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 12: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దివాలా బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో మదుపరుల్లో కొత్త ఉత్సాహం నెలకొనడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ లాంటి బ్యాంకింగ్ స్టాక్స్ నారీ లాభాలు ఆర్జించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 193.20 పాయింట్లు లాభపడి 25,790.22 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 7900 పాయింట్ల స్థాయికి చేరుకుంది. రాజ్యసభలో బుధవారం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దివాలా బిల్లుకు ఆమోదం లభించడంతో ప్రధానంగా బ్యాకింగ్ స్టాక్స్ మెరిశాయి. ఐసిఐసిఐ బ్యాంక్ షేరు 3.46 శాతం పెరగ్గా, ఎస్‌బిఐ 1.87 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు 1.05 శాతం పెరిగాయి. దివాలాకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారానికి ఒకే ఏకీకృత చట్టాన్ని తీసుకురావడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. సవరించిన మారిషస్ పన్ను ఒప్పందం భయాలను మదుపరులు వదులుకోవడానికి ఇది దోహదపడిందని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. ఈ భయాల కారణంగా బుధవారం సెనె్సక్స్ 175 పాయింట్లకు పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఒక దశలో 250 పాయింట్లకు పైగా లాభపడిన సెనె్సక్స్ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 25,620.27 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 193.20 పాయింట్ల లాభంతో 25,790.22 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం ఒక దశలో 7,916 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరినా చివరికి 51.55 పాయింట్ల లాభంతో 7900.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగియగా, తొమ్మిది మాత్రం నష్టాలు చవిచూశాయి. డాక్టర్ రెడ్డీస్ అత్యధికంగా 3.65 శాతం లాభపడగా, ఐసిఐసిఐ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, టిసిఎస్, ఎస్‌బిఐ, టాటా మోటార్స్, రిల్, బజాజ్ ఆటో, లుపిన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు కూడా బాగానే పెరిగాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, సింగపూర్ సూచీలు లాభాలతో ముగియగా, చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలో నష్టాలు చవి చూసినా ఆ తర్వాత కోలుకున్నాయి.