బిజినెస్

చాలు.. ఇక ఆపండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి శుక్రవారం ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శేషసాయి హయంలో ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ పూర్తిగా విఫలమైందని మూర్తి ఎండగట్టినది తెలిసిందే. దీనిపై తాజాగా శేషసాయి స్పందిస్తూ ఈ దూషణలు ఇక ఆపండంటూ ధ్వజమెత్తారు. మూర్తి వ్యక్తిగత దూషణలకు దిగడం, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రకటనలు చేయవద్దన్నారు. మూర్తి తీరే సంస్థలో సంక్షోభానికి కారణమన్న విధంగా మండిపడ్డారు.
కాగా, మదుపరుల ప్రయోజనాలను కాపాడటానికే ఇన్ఫోసిస్ బోర్డు తీరుపట్ల తాను గొంతెత్తానని మూర్తి స్పష్టం చేసినది తెలిసిందే. ఇటీవల ఓ కాన్ఫరెన్స్ కాల్‌పై మదుపరులతో మాట్లాడిన మూర్తి.. తన వైఖరిని సమర్థించుకున్నారు. మదుపరుల ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యతని చెప్పారు. తాను నోరు మూసుకుంటే సంస్థకు చావుదెబ్బ తగిలేదన్న మూర్తి, గత బోర్డు వైఖరి చూడలేకపోయానన్నారు. నీలేకని నాయకత్వంలో ఇన్ఫోసిస్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నది విదితమే. ఇవి సంస్థలోని ఉన్నతస్థాయిలో మార్పులకు దారితీయగా, నూతన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ సిఇఒ నందన్ నీలేకని వచ్చారు. బోర్డు తీరుపట్ల వ్యవస్థాపకులు, ముఖ్యంగా మూర్తి పెద్ద ఎత్తున అసంతృప్తిని వెలిబుచ్చడంతో సంస్థ సిఇఒ, ఎండిగా ఆయన ఏరికోరి తెచ్చుకున్న విశాల్ సిక్కా రాజీనామా చేసి వెళ్లిపోయారు. చైర్మన్‌గా ఆర్ శేషసాయి కూడా తప్పుకున్నారు. సహ చైర్మన్‌గా రవి వెంకటేశన్ కూడా వైదొలిగారు. విశాల్ సిక్కా సైతం శేషసాయ తరహాలోనే తనపై దుష్ప్రచారం జరుగుతుంటే పనిచేసేదెలా? అని ప్రశ్నిస్తూ పదవికి గుడ్‌బై చెప్పడం గమనార్హం.