బిజినెస్

సేవింగ్స్ ఖాతా వడ్డీరేట్లను తగ్గించిన కెనరా బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో పొదుపు ఖాతాల్లోని సొమ్ముకు ఇకపై 3.5 శాతం వరకే వడ్డీ లభించనుంది. అయితే 50 లక్షల రూపాయల వరకే ఈ వడ్డీరేటు. అంతకంటే ఎక్కువ ఉంటే 4 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఈ మేరకు శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది. మారిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఎస్‌బిఐ కూడా జూలై 31న కోటి రూపాయల వరకు నగదున్న సేవింగ్స్ ఖాతాలకు 3.5 శాతమే వడ్డీరేటు వస్తుందని ప్రకటించినది తెలిసిందే.